ఇంజినీరింగ్‍లో కాలేజిలో చేరబోతున్నారా? ఇలా చేస్తే మీ విజయం ఖాయం
ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతున్నారా?
మీకు తెలుసా? ఇంటర్మీడియేట్ దాకా ర్యాంకులు తెచ్చుకున్న చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీలో సరిగ్గా పర్‍ఫార్మెన్స్ చూపలేక ఫెయిల్ అవుతూ వుంటారు.
దీనికి కారణం ఏమిటి?
ఈ వ్యాసం చివరిదాకా చదివితే మీకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఈ వ్యాసం లో పేర్కొన్న ఏ అంశమూ కూడా మీకు గూగుల్ లో గానీ లేదా ఇతర బుక్స్ లో గాని దొరకవు. నా అనుభవం లో అనేక వేల మంది విద్యార్థులన్ను దగ్గరనుంచి చూసి, అనేక మల్టినేషనల్ కంపెనీల హెచ్చార్ మేనేజర్లతో ముఖాముఖి మాట్లాడి తెలుసుకున్నా అభిప్రాయాలు, అనేక మంది విద్యావేత్తలతో సంభాషించినపుడు తెలుసుకున్న అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.
ఇది ఒక రీసెర్చి లాంటి ప్రక్రియ అని నేను నిస్సందేహంగా చెప్పగలను.
మీకు అమూల్యమైన విషయాలు తెలియచేయటం ఈ వ్యాసం యొక్క ముఖ్యోద్దేశం. మీరు ఇంజినీరింగ్‍లో చేరబోయే విద్యార్థి అయినా, పిల్లవాని తలితండ్రులు అయినా ఈ వ్యాసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత మీ పిల్లలు మొదటి రోజు నుంచే సక్సెస్‍ఫుల్‍గా వుండాలంటే ఏమి చేయాలి అన్న అంశము ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. చివరిదాకా చదవండి.చాలా మంది పేరెంట్స్ కి, విద్యార్థులకు ఉన్న అపోహ ఏమిటంటే, ఇంజినీరింగ్‍లో చక్కటి పర్సంటేజి తెచ్చుకుంటే, ఆటోమేటిగ్గా మంచి ఉద్యోగం వస్తుంది అన్నది. ఇది పూర్తిగా అపోహ. ఉద్యోగం రావాలంటే మంచి డిగ్రీ వుండాలి నిజమే, అది ఇంజినిరింగ్ అయితే మరీ మంచిది. మంచి మార్కులతో అయినా సరే కేవలం డిగ్రీ మాత్రమే సరిపోదు. ఉద్యోగం రావాలంటే కావాల్సిన ముఖ్యమైన అంశాలు మీకు ఇంజినీరింగ్ కాలేజిలో నేర్పించరు. ఇది నగ్నసత్యం.
మంచి పర్సంటేజీ, మంచి డిగ్రీ ఉన్నా కూడా క్యాంపస్ ప్లేస్మ్‍మెంట్ రాక, బయటకూడా ఉద్యోగాలు దొరక్క చాలామంది ఇంజినీరింగ్ పట్టభద్రులు మనకు చాలామందే తారస పడుతుంటారు.
మరి ఏమిటి ఆ ముఖ్యమైన అంశాలు?
నేను ప్రతిరోజు మల్టినేషనల్ కంపెనీల హెచ్చార్ మేనేజర్లతో మాట్లాడుతూ వుంటాను. వారందరూ ముక్తకంఠంతో చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు క్యాండిడేట్లలో ఈ క్రింది అంశాలు వుంటేనే ఆయా క్యాండిడేట్లని సెలక్ట్ చేసుకుంటామని వారు చాలా క్లియర్గా నాతో చెప్తారు .అవి ఏమిటంటే
- Fluency in English
- Communication Skills
- Soft Skills
- Personality Development
- Common Sense
దురదృష్టవశాత్తూ ఇంజినీరింగ్ కాలేజీలలో కేవలం టెక్నికల్ నాలెడ్జిని అందించటంపై ఏకాగ్రత చూపిస్తారు. అత్యంత ఆవశ్యకమైన పై అంశాల పట్ల ఇంజినీరింగ్ కాలేజి యాజమాన్యాలు శ్రద్ద వహించరు.
విద్యార్థిలో పైన పేర్కొన్న అంశాలు లేకుంటే ఏ కంపెనీ హెచ్చార్ మేనేజర్ కూడా ఆ క్యాండిడేట్ ని సెలక్ట్ చేసుకోడు. ఆ విద్యార్థికి ఎంత చక్కటి పర్సంటేజి వచ్చినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఇతర సాఫ్ట్ స్కిల్స్ లేకుంటే ఆ క్యాండేడేట్ ని సెలక్ట్ చేసుకోరు.
హెచ్చార్ మేనేజర్లు చాల క్లియర్ గా చెప్పే అంశం ఏమిటంటే, ఇంజినీరింగ్ కాలేజీలో వీళ్ళు నేర్చుకునే సిలబస్ కీ, రియల్ లైఫ్ లో ఇండస్ట్రీలో వుండే రిక్వైర్‍మెంట్ కీ చాలా తేడా వుంటుంది. అందువల్ల ప్రతీ క్యాండిడేట్ కీ తిరిగి టెక్నికల్ ట్రెయినింగ్, ప్రాడక్ట్ ట్రెయినింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా ప్రతి కంపెనీలో రిఫ్రెషర్ ట్రెయినింగ్ ప్రోగ్రాంస్, అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ప్రోగ్రాంలు ఎలాగూ వుంటాయి. కాబట్టి టెక్నికల్ స్కిల్స్ అన్న అంశం పెద్ద సంగతి కాదు, అది మేము ఎలాగు ట్రెయినింగ్ ఇచ్చుకుంటాము. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాస్ శిక్షణ ఇలాంటి అంశాలు అయా క్యాండిడేట్లకు స్వతఃసిద్దంగా వుంటేగానీ తీసుకోము. కాబట్టి ఇది అసలు కీలకం.
చాలా మంది నన్ను తరుచు అడిగే ప్రశ్న ఇది.
ఇంటర్ వరకూ అత్యధిక పర్సంటేజీతో పాసయ్యి, ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకున్నప్పటికీ, తెలివితేటలు గలిగిన అత్యధిక విద్యార్థులు ఎందుకు ఇంజినీరింగ్ లో సరిగ్గా రాణించలేకపోతుంటారు? ఒక వేళ ఇంజినీరింగ్‍లొ మంచి మార్కులే తెచ్చుకున్నప్పటికీ ఎందుకు ఇంటర్వ్యూలలో ఎందుకు విఫలమవుతూ వుంటారు?
కొన్ని చేదు నిజాలు.
నేను వృత్తి రిత్యా ట్రెయినర్ గా అనేక వేల మంది విద్యార్థులను చూసిన అనుభవంతో మీకు కొన్ని చేదు నిజాలు ఇక్కడ చెప్పాలి.ఈ సమస్యలన్నింటికీ మూల కారణం మన స్కూలు విద్యావిధానంలో వుంది. స్కూల్లో మొత్తం ఫోకస్ పరీక్షలు, మార్కులూ ర్యాంకులు వీటి మీద మాత్రమే వుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసే విధంగా చాలా తక్కువ స్కూల్సు వుంటాయి. వీరి ధ్యాస ఎంతసేపు పదవ తరగతిలో 10/10 గ్రేడు ఎంత మంది విద్యార్థులకు వచ్చాయి, వాళ్ళ ఫోటోలు ప్లెక్స్ బోర్డులమీదా, న్యూస్ పేపర్లో ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వేయటం మీద వుంటుంది. దాని వల్ల వాళ్ళకు తదుపరి సంవత్సరం ఎన్ని అడ్మిషన్లు అవబోతున్నాయి అన్నదాని మీద ఫోకస్ వుండటం వల్ల ,విద్యార్థులను కేవలం ర్యాంకులు, గ్రేడ్లు తెచ్చిపెట్టే రోబోట్ల లాగా ట్రీట్ చేస్తూ వుంటారు. వారికి ఒక వ్యక్తిత్వం వుంటుంది అని, దానిని అభివృద్ది చేయాలని గానీ, వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి అని గాని, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వారిలో ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటిస్ పట్ల అనురక్తి పెంచుదామని గాని వాళ్ళనుకోరు. నిజానికి ఇవే ముఖ్యం వ్యక్తిగా విద్యార్థి ఎదగటానికి.
కాని తమ అడ్మిషన్ల కోసం వారు ఎంతసేపున్నా మార్కులూ, మార్కులూ అంటూ విద్యార్థిని చీకటి కొట్లో కట్టేసి పగలూ రాత్రీ చదువు, చదువు అంటూ హింస పెట్టేసి, వారిని వ్యక్తిత్వంలేని, వెన్నెముకలేని జీవఛ్ఛవాలుగా మార్చేసి జబ్బలు చరచుకుంటుంటారు.
ఇంటర్మీడియెట్ విద్య పరిస్థితి ఇంకా ఘోరం. తమకు ర్యాంకులు తెచ్చిపెట్టే అవకాశమున్న విద్యార్థులని ఒక రకమైన హింసకి, తక్కువ మార్కులు వస్తాయేమోన్నవిద్యార్థికి ఇంకో రకం హింసకి గురిచేస్తూ, ఒకరితొ ఒకరికి పోలికలు తెస్తూ, విద్యార్థులను ఆత్మహత్యకు సైతం తెగబడేలా నరకం చూపించి, కేవలం ఎంసెట్, ఐ,ఐ,టీ లో ర్యాంకులు మాత్రమే జీవిత పరమావధిగా ఎంచి ఇరవై నాలుగు గంటలూ కేవలం బట్టీ పట్టించటం ఒక్కటే చదువు అన్న చందాన సాగిపోతుంది ఇంటర్మీడెయెట్ విద్య.
ఇలాంటి నేపధ్యంలో విద్య నేర్చుకున్న విద్యార్థికి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలెపెమెంట్ ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం వుంటుంది?
ఈ యావత్తు ప్రక్రియలో పూర్తిగా దెబ్బ తినేది ఎవరు అంటే విద్యార్థి మాత్రమే.
చిన్నపిల్లలలో సహజంగా వుండే ఉత్సాహం, కుతూహలం ఇలాంటి ఆరోగ్యకరమైన లక్షణాలని మన స్కూలింగ్ వ్యవస్థ, మరియూ ఇంటర్‍మీడియేట్ విద్యావిధానం నీరుగార్చివేస్తోంది. దీని కారణంగా విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు వంటివి పొందలేకపోవటమే కాక ఒక విధమైన నిస్తేజానికి గురయి వుంటారు.
ఎంత పెద్ద సిటిలో అయినా సరే , తెలంగాణా, ఆంధ్రపదేశ్ లలోని స్టేట్ బోర్డు సిలబస్ తో హైస్కూలు చదువు, అదే విధంగా ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇందాక మనం చెప్పుకున్నట్టు కమ్యూనికేషని స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ భాష మీద పట్టు వుండదు.
మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని తలితండ్రులు అమాయకంగా చంకలు గుద్దుకోవాల్సిందే. విద్యాసంస్థల యజమన్యాలు, నిజానికి తమ పిల్లలని ర్యాంకుల యజ్గ్న్యంలో సమిధలుగా వాడుకున్నారని, వారికి తమ పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ది పట్ల ఏమాత్రం చిత్త శుద్ది లేదని కేవలం యాజమాన్యాల ర్యాంకుల దాహానికి తమ పిల్లలు ఆహుతయ్యారని తెలుసుకునే లోపల తెల్లవారిపోతుంది.ఈ విషయం తలితండ్రులకు అర్థమయ్యేటప్పటికి పుణ్యకాలం గడిచిపోతుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్‍లోనూ ర్యాంకులు, గ్రేడులు అంటూ ఇదే అర్థరహితమైన చర్చ వుంటుంది.
మార్కులు, ర్యాంకులు, గ్రేడులు అధారంగా ఇంజినీరింగ్ లో సీట్ ఇవ్వరు కద. అక్కడ సబ్జక్టు మీద గ్రిప్ వున్న విద్యార్థి మాత్రమే ఎంటన్స్‌లో రాణిస్తాడు.
యాజమాన్యాలు పేరెంట్స్ మైండ్‍ని తెలివిగా ఒక చట్రంలో ఇరికించి పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ తంతు అయిందని అనిపించి అప్పటికి కాలం గడిపేస్తారు.
అరె మాపిల్లలకి సబ్జక్టులో ఎంత లోతుగా అవగాహన ఏర్పడింది, మా పిల్ల వాడికి కమ్యూనికేషని స్కిల్స్ ఎంతమేరా అభివృద్ది చెందాయి అన్నఆలోచన పేరెంట్స్‌కీ వుండదు. వాళ్ళ చర్చ ఎంత సేపూ మార్కులూ , ర్యాంకులూ వీటి మీద ఏకాగ్రమయి వుంటుంది.
సాధారణంగా ఇంటర్‍మీడియేట్ అవ్వంగానే పిల్లలు ఈ క్రింద చెప్పుకున్నట్టు రెండు రకాల ఇంజినీరింగ్ కాలేజీలలో చేరే అవకాశం వుంది.
1) స్థానికంగా వుండే ఇంజినీరింగ్ కాలేజీలు
2) ఐ.ఐ.టీ / బిట్స్ లాంటి ప్రీమియర్ కాలేజీలు
లోకల్ఇంజినీరింగ్ కాలేజీలలో చేరే విద్యార్థుల పరిస్థితి
స్థానికంగా వుండే ఇంజినీరింగ్ కాలేజీలలో చేరే విద్యార్థులు, ఇంటర్‍మీడియేట్ కాలేజిలో లాగానే ఇక్కడ కూడా చక్కగా చదువుకుని, బట్టీ పట్టి, ఎప్పటికప్పుడు మిడ్స్, సెమిస్టర్స్ వ్రాసి మంచి మార్కులు తెచ్చుకుంటు గడిపేస్తారు. ఇక్కడ కూడా , తమకు తెలిసిన పద్దతిలోనే చదువు కొనసాగిస్తారు. బట్టీ పట్టటం, పరీక్ష్లలలో మార్కులు తెచ్చుకోవటం, తన సాటి మిత్రులను పోటీదారులుగా భావిస్తూ టీం స్పిరిట్ లేకుండా తమలో తామే కూపస్త మండూకాలుగా వుండిపోవటం వంటి లక్షణాలనే కొనసాగిస్తారు.ఇంకో రకం పిల్లలు వుంటారు, వారు ఇంటర్మీడియేట్ దాకా వున్న అమిత కట్టుబాటు వాతావరణంలోంచి బయట పడి ఒక్కసారిగా ఇంనినీరింగ్ కాలేజీ వాతావరణంలో లభించే స్వేఛ్ఛావాయువులు పీల్చగానే కళ్ళాలు తెగిన గుర్రాల లాగా ఫీలయి, దురభ్యాసాలకు, దుస్సావాసాలకు అలవాటు పడి, చదువును అటకెక్కిస్తారు. డ్రగ్స్ లాంటి మహమ్మారి బారిన పడేది కూడా ఇలాంటి పిల్లలే.
ఏతా వాతా, ఉద్యోగానికి పనికి వచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ గట్రా నేర్చుకోవటం వెనుకబడి పోతుంది.
కాలేజి మేనేజిమెంట్ వారు కమ్యునికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇంటర్‍మీడియేట్ కాలేజిలవారికి ర్యాంకుల్ తెచ్చుకోవటం మీద ఎలా ధ్యాస వుంటుందో, ఈ స్థానిక ఇంజినీరింగ్ కాలేజిల యాజమాన్యాలకి ప్లేస్‍మెంట్ల మీద కన్ను వుంటుంది.
అందుకే వారు కొందరు ట్రెయినర్లను పిలిపించి వారితో ఒప్పందం చేసుకుని పిల్లలకు కమ్యునికేషని స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ గట్రా ట్రెయినింగ్ దాదాపు మూడవ సంవత్సరం లో ఇప్పించటం చేస్తారు. ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లాంటిది.
ఏ మాటకామటే చెప్పుకోవాలి. కాలేజి యాజమాన్యాలది ఉద్దేశ్యం మంచిదే. కానీ వారికి దొరికే ట్రెయినర్లతోనే సమస్య.
కాలేజీ యాజమాన్యాలు వీలయినంత తక్కువ డబ్బుతో ట్రెయినింగ్ కార్యక్రమం పూర్తి చేయించాలనుకుంటారు. ఇంకా చిత్రమేమిటంటే ఈ ట్రెయినింగ్ కు సంబంధించి వారు చేతినుంచి పెట్టేదేమీ వుండదు. విద్యార్థుల దగ్గరనుంచే వసూలు చేస్తారు ఆ డబ్బులు కూడా.
ఆ ట్రెయినింగ్ చెయిస్తానని ఎవరయితే ఒప్పుకుని మొదలెడతాడో, ఆయన్ ఒక ఏజెంట్ లాంటి వాడు . అంతే. ఆయన తనకు వచ్చే ఆ కొద్ది పాటి డబ్బులో వీలయినంత మిగిలిచ్చుకోవటానికే ప్రయత్నం చేస్తాడు. అందుకే అతి తక్కువ జీతాలకు దొరికే చిన్న చిన్న ట్రెయినర్లను తెచ్చుకుంటాడు. వారికీ కేవలం ఉత్సాహం తప్పనిచ్చి అనుభవం వుండదు. వీరికి విషయ పరిజ్న్యానం కూడా వుండదు.
ఈ విధమైన ట్రెయినర్లు కేవలం స్టేజి ఎక్కి మైకు పట్టుకుని వెర్రి కేకలు వేయటం, స్టేజి పై అటు నుంచి ఇటు పరిగెడుతూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ , గంతులు వేస్తూ,ఆడియెన్స్‌తో కూడా వెర్రి కేకలు వేయిస్తూ అదే ట్రెయినింగ్ అని విశ్వసిస్తారు. చివరికి ఈ ట్రెయినింగ్ వల్ల సమయం వృధా అవటం తప్ప ప్రయోజనం శూన్యం.
ఇంజినీరింగ్ కాలేజీ మేనేజిమెంట్ వారేమో తాము ట్రెయినింగ్ ఇప్పించాము అని విశ్వసిస్తారు, చక్కటి ట్రెయినింగ్ ఇచ్చి వెళ్ళాము అని ఈ బీ-గ్రేడ్ ట్రెయినర్లు అనుకుంటూ వుంటారు.
నిజానికి ఇక్కడ జరిగేది ఒక పెద్ద డ్రామా తప్పనిచ్చి విద్యార్థులకు నిజంగా ఒరిగేది ఏమీ వుండదు. చివరికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇంటర్వ్యూని ఎదుర్కొనేటప్పుడు గానీ విద్యార్థికి అర్థం కాదు, తాను ఏమి కోల్పోయాడో.
కంపెనీ హెచ్చార్ మేనేజర్లకి పోయేదేమి ఉండదు. ఈ కాలేజి కాకపోతే మరో కాలేజి అని అనుకుని అందర్నీ రిజెక్ట్ చేయటమో లేదా సహజసిద్దంగా పర్ఫార్మ్ చేసిన ఒకరిద్దరు విద్యార్థులను ఎన్నిక చేసుకుని వెళ్ళిపోతారు.
ఐ.ఐ.టీ లాంటి ప్రీమియర్ ఇంజినీరింగ్ కాలేజీలలో చేరే విద్యార్థుల పరిస్థితి
ఎంత పెద్ద సిటిలో అయినా సరే , తెలంగాణా, ఆంధ్రపదేశ్ లలోని స్టేట్ బోర్డు సిలబస్ తో హైస్కూలు చదువు, అదే విధంగా ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇందాక మనం చెప్పుకున్నట్టు కమ్యూనికేషని స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ భాష మీద పట్టు వుండదు.ఇలాంటి వాతావరణం నుంచి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థి , ఎకాఎకిన ఐ.ఐ.టీ లాంటి ప్రీమియర్ విద్యా సంస్థలలో చేరంగానే అక్కడ వున్న ఇతర విద్యార్థులను చూసి, ఒక విధమైన ఆత్మ న్యూనతకి గురువుతారు. సరయిన కమ్యూనికేషని స్కిల్స్ , ఇంగ్లీష్ భాషపై పట్టు లేక పోవటం వల్ల ఎవరితో కలివిడిగా వుండలేక పోతారు. క్రమంగా వారి పర్‍ఫార్‍మెన్స్ దెబ్బ తింటుంది.
అక్కడికి వెళ్ళాక నీటిలోంచి బయట పడ్డ చేప లాగా ఫీలవుతాడు. ఆత్మ విశ్వాసం దెబ్బతిని ఒక విధమైన ఒంటరి తనానికి గురవుతాడు. అసలు విషయం అయిన చదువు సైతం దెబ్బ తింటుంది.
మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా?
బాధ పడకండి. మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం వుంది. ఒక మంచి సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ సంస్థ ఎక్కడ వుందో కనుక్కుని శిక్షణ తీసుకోవటం వల్ల మీ సమస్యకి నూటికి నూరు శాతం పరిష్కారం లభిస్తుంది.లోకల్ కాలేజీలలో చేరబోతున్నా, ప్రీమియర్ ఐ.ఐ.టీ లలో చేరబోతున్నా, తప్పని సరిగా విద్యార్థులందరూ ఇంజినీరింగ్ కోర్స్ చేరబోయే ముందు తప్పని సరిగా అనుభవజ్గ్యులైన సీనియర్ ట్రెయినర్ల వద్ద సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ మరియూ వ్యక్తిత్వ వికాస శిక్షణ వంటి అన్ని అంశాలలో మంచి శిక్షణ కనీసం రెండు నెలల పాటు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఒక మంచి సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ సంస్థ ఎక్కడ వుందో కనుక్కుని శిక్షణ తీసుకోవటం తప్పని సరి.
స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో చేరవచ్చా?
అందరూ చేసే పొరపాటు మీరు చేయకండి. ఎట్టి పరిస్థితిలోనూ సాధారణ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో చేరకండి. అక్కడ యధా ప్రకారం స్కూళ్ళలోనూ , కాలేజిలలో ను పని చేసే టీచర్లూ, లెక్చరర్లూ మీకు ఫాకల్టీ రూపం లో దర్శనం ఇస్తారు. వారికి తెలిసింది గ్రామర్ చెప్పటం మాత్రమే. వారికి కమ్యూనికేషని స్కిల్స్ వంటి లైఫ్ స్కిల్స్ నేర్పించటంలో అనుభవం శూన్యం. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో చేరటం అంటే, తిరిగి సమస్య మొదటికొస్తుంది. ఇంకా కరెక్టుగా చెప్పాలి అంటే , పెనంలోంచి పొయ్యిలోకి పడినట్టు అవుతుంది.
కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ సాధారణ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో చేరవద్దండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టీట్యూట్లలో ఎంతసేపున్నా అనువాద పద్దతి ద్వారా వాక్య నిర్మాణం, గ్రామర్ సూత్రాలు బట్టీ పట్టించటం ఇలా పరిమిత స్థాయిలో శిక్షణ వుంటుంది. career conscious people కి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేక పోగా, సమయం, డబ్బు వృధా అవుతాయి. అసలు లక్ష్యం నెరవేరదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వుంటుంది.
ఒక మంచి సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ సంస్థ ఎక్కడ వుందో ఎలా కనుక్కోవాలి?
గూగుల్ లో వెదికి మరీ చేరండి. వారి ట్రెయినర్ యొక్క అనుభవం ఎంతో కనుక్కోవాలి. వారి క్లాసుల వీడియోలు యూ ట్యూబ్ లో చూడండి. గూగుల్ లో ఆ ఇన్స్టిట్యూట్ యొక్క స్టార్ రేటింగ్స్ చూసుకోవాలి.గూగుల్ లో పాత విద్యార్థుల రివ్యూలు చూడాలి.
కనీసం ఒక వారం పాటు క్లాసులకు ఉచితంగా అటెండ్ అవుతామని డిమాండ్ చేసి అడిగి మరీ చేరాలి.
ఇక్కడ మీకు మీ ఫ్యూచర్ ఇంపార్టెంట్. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అని చెప్పి చేరటం కాదు, ఇది మీ కెరియెర్ కి సంబంధించి చాలా ముఖ్యమైన నిర్ణయం.
కార్పొరేట్ ట్రెయినింగ్స్ లో విశేష అనుభవం ఉన్న MNC Trainers చే నడపబడే సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరాలి.
కాని ఒకటి మాత్రం నిజం, మీకు కేవలం ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్ మాత్రమే విజయాన్ని అందించగలరు.
All the best.
The Author is
Dr.Vivekanand Rayapeddi
Director - Royal Soft Skills CampusDilsukhnagar Hyderabad.
Employability Trainer / Success Coach
GD -Interview Skills & Soft Skills Trainer
Public Speaking Skills / The pioneer in Paperless Fluency
Author - Speaker - Trainer - Motivator
Ph: 9246371893
Nice article for students and parents
ReplyDeleteThank you very much Mr.NRS Murthy. I request you to forward this article to all your friends. If it helps at least one student, the purpose of this article gets served.
DeleteOnce again thank you sir for your nice remarks.
Really Nice Article Sir !!
ReplyDeleteThank you
DeleteThis comment has been removed by the author.
DeleteThank You for the informatie article. As a lecturer and principal for degree college, i have seen so many students with lack of communication skills and soft skills. Actually this is need of hour. I want to appreciate you for your noble work guiding and helping them to choose the right way.
ReplyDeleteThank you very much for your review. It really gave me great amount of moral booboboosting. It helped me to write more articles
Delete